వీఆర్ఏల సమ్మె విరమణ
సీఎస్ తో చర్చలు సఫలం..
రేపట్నుంచి విధుల్లోకి..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. అంతకుముందు ఆయన హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో వీఆర్‌ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌ను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తెలిపారు. అలాగే పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ ప్రతినిధులు కోరారు. సమస్యల పరిష్కారం కోరుతూ 80 రోజులుగా వీఆర్‌ఏలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వీఆర్ఏల డిమాండ్లపై సీఎస్‌తో చర్చించామని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. వచ్చే నెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక కోడ్ దృష్ట్యా వచ్చే నెల నిర్ణయిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. వీఆర్ఏలు రేపట్నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్షుడు తెలిపారు. గురువారం విధుల్లో చేరుతామని వీఆర్‌ఏ ఐకాస ప్రతినిధులు వెల్లడించారు.
వీఆర్ఏల సమ్మె విరమణ
RELATED ARTICLES
Recent Comments