Monday, April 21, 2025
Homeజిల్లా వార్తలుబతుకమ్మలతో వీఆర్ఏల నిరసన

బతుకమ్మలతో వీఆర్ఏల నిరసన

బతుకమ్మలతో వీఆర్ఏల నిరసన
స్పాట్ వాయిస్ నర్సంపేట(ఖానాపురం) : ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, జీవోలు అమలు చేయాలని ఆదివారం ఖానాపూర్ లో వీఆర్ ఏ ల సంఘం మండల అధ్యక్షుడు బానోతు భిక్షపతి ఆధ్వర్యంలో సమ్మె శిబిరం వద్ద బతుకమ్మలు ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు బైరబోయిన ఐలేష్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వీఆర్ఏలకు శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు రాగం సుదర్శన్, జిల్లా జేఏసీ కో కన్వీనర్ గోనె మాధవి, మండల ప్రధాన కార్యదర్శి కొండపర్తి రవికుమార్, కోశాధికారి గోక నరసయ్య, సంధ్య, రజిత, సుధాకర్, గోవర్ధన్, స్వామి, కందిపాటి శీను, హరీష్, వీరభద్రం, సాంబయ్య, శ్యామ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments