‘వికసిత్ భారత సంకల్ప యాత్ర’ ఏర్పాట్ల పరిశీలన
స్పాట్ వాయిస్, దామెర: మండల కేంద్రంలో గురువారం నిర్వహించనున్న ‘వికసిత్ భారత సంకల్ప యాత్ర’ కి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వస్తున్న సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ గ్రామంలోని పోచమ్మ దేవాలయం వద్ద స్థల పరిశీలన చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాలను సమాజంలో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడానికి ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ, వివిధ విభాగాల 18 స్టాల్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను వెనువెంటనే లబ్ధి చేకూరాలనే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప్ యాత్ర అనే కార్యక్రమం సజావుగా సాగడానికి భద్రత పరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేశం యాదవ్,ఎస్సై కొంకా అశోక్, బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments