Thursday, April 17, 2025
Homeతెలంగాణవీహెచ్ ఇంటిపై రాళ్లదాడి

వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి

ఖండించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత. మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇంటిపై బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ వీహెచ్​ ఇంటిపై జరిగిన దాడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. వీహెచ్​తో ఫోన్​లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని రేవంత్​రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments