Friday, September 20, 2024
Homeతెలంగాణవేములవాడలో నిత్యాన్నదానం..

వేములవాడలో నిత్యాన్నదానం..

వచ్చే కార్తీక మాసం నాటికి ప్రారంభం..
స్పాట్ వాయిస్, వేములవాడ: తిరుమలలోని అన్నదాన సత్రం మాదిరిగానే వేములవాడలో రాజేరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వచ్చే కార్తీక మాసం నాటికి వేముల వాడ ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రావణమాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు.ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​తో పాటు కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవోలు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి అనుగుణంగా శాస్త్త్రోక్తంగా వేదపండితులు, శృంగేరి పీఠాధిపతి సలహాలుసూచనల మేరకు ఆలయ విస్తరణ చేస్తామని తెలిపారు. తిరుమలలో ఉన్న నిత్యాన్నదాన కార్యక్రమం మాదిరిగానే వేములవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసేందుకు శివుని అశీర్వాదం కోరుతున్నామని అన్నారు. నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సంబంధించి భక్తులు, దాతల సహకారం కూడా అవసరమని తెలిపారు. నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణాన్ని ప్రభుత్వం తరఫున నిర్మిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments