2019కి ముందు వెహికల్ కొన్నారా..
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు తీసుకోవాల్సిందే..
లేదంటే వాహనం సీజే..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ లో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్‌ఎస్‌ఆర్‌పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది గడువు విధించింది. https//www.siam.in/లో దరఖాస్తు చేసుకోవాలి. టూ వీలర్స్‌కు రూ.320 నుంచి రూ.380, త్రీవీలర్స్‌కు రూ.350 నుంచి రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590 నుంచి రూ.700, కమర్షియల్ వాహనాలు రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లించాలని రవాణాశాఖ బుధవారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించింది.
Recent Comments