Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలుఘనంగా రేపాక లో వాల్మీకి జయంతి వేడుకలు

ఘనంగా రేపాక లో వాల్మీకి జయంతి వేడుకలు

ఘనంగా రేపాక లో వాల్మీకి జయంతి వేడుకలు
రేగొండ, స్పాట్ వాయిస్ : మండలంలోని రేపాక గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు వాల్మీకి సంఘం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మండల దనపాల్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. మొదట వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సనాతన ధార్మిక స్థాపన మహర్షి వాల్మీకి ద్వారా జరిగిందని, ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. ధర్మం, సత్యం, సోదరభావం, ప్రజాపాలన రామాయణంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయన్నాయని, దానికి కారణం వాల్మీకి నేనన్నారు. వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో కుల పెద్ద మనుషులు గుల్ల నర్సయ్య, కుర్రే గంగయ్య, సర్పంచ్ పొనగంటి తిరుపతి, ఎంపీటీసీ వెంగళ సుజాత నరసయ్య, ఉప సర్పంచ్ గుల్ల తిరుపతి, కొండల్ రెడ్డి, సంపత్ రెడ్డి, వాల్మీకి యూత్ నాయకులు గుల్ల రాజేందర్, మండల రవి, మీనుగు శివ, గుల్ల హరికిషన్, మండల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments