Saturday, November 23, 2024
Homeతెలంగాణయూనిఫాం ఉద్యోగాలకు తీవ్ర పోటీ

యూనిఫాం ఉద్యోగాలకు తీవ్ర పోటీ

17,516 ఉద్యోగాలకు 12.91 ల‌క్షల దరఖాస్తులు
స్పాట్ వాయిస్, బ్యూరో: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు భారీగా వచ్చినట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వెల్లడించింది. పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గురువారం రాత్రి 10 గంటలతో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 12.91 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని టీఎస్ఎల్పీఆర్బీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఆగ‌స్టు 7న ఎస్సైప్రాథ‌మిక అర్హత ప‌రీక్ష, 21న కానిస్టేబుల్ ప్రాథ‌మిక అర్హత ప‌రీక్ష నిర్వహించనున్నారు. హైద‌రాబాద్, రంగారెడ్డి, న‌ల్లగొండ‌, ఖ‌మ్మం, సూర్యాపేట‌ నుంచి దరఖాస్తులు అత్యధికంగా రాగా.. ములుగు, ఆసిఫాబాద్, భూపాల‌ప‌ల్లి, నారాయ‌ణ్‌పేట్‌, జ‌న‌గాం, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల నుంచి అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి.

2.76 ల‌క్షల మంది మ‌హిళ‌లు
17,516 పోస్టులకు మొత్తంగా 7.33 ల‌క్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. ఒక‌టి కంటే ఎక్కువ ఉద్యోగాల‌కు 3.55 ల‌క్షల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తం ద‌ర‌ఖాస్తుల్లో 2.76 ల‌క్షల మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఎస్సై ఉద్యోగాల‌కు 2.47 ల‌క్షలు, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 9.5 ల‌క్షల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తెలుగులో ప‌రీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు ఆప్షన్ ఎంచుకోగా, ఇంగ్లిష్ మీడియంలో ప‌రీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్ ఎంచుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments