ఉద్యమకారులకు అండగా ఉంటాం..
అధైర్యపడి ఆత్మహత్య చేసుకోవద్దు
తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు అంబటి శ్రీనివాస్
స్పాట్ వాయిస్ నల్లబెల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుడు వడ్లూరి సత్యం శనివారం వరంగల్ లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న వడ్లూరి సత్యం పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉద్యమకారుల తరఫున జేఏసీ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ లోని ట్యాంక్ బ్యాండ్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించి సాగర హారం లో పాల్గొని పోలీస్ లాఠీ దెబ్బలు తినడం మూలంగా నరాలు దెబ్బ తినడంతో వైద్యం చేయించుకునే ఆర్ధికపరిస్థితులు సహకరించగా, భార్య పై ఆధారపడి ఎన్ని రోజులు ఇలా జీవించాలని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని వారు అన్నారు. పాలకులు సత్యంకు సరైన సమయంలో వైద్యం చేయించి, వారి కుటుంబానికి ఆర్ధికంగా సహకరిస్తే ఇలా జరిగి ఉండేది కాదు అని వారు అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల చదరపు ఇంటి స్థలాన్ని, రూ.25,000/- రూపాయలు ప్రతి నెల పెన్షన్ సత్యం గారి కుటుంబానికి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ పండు క్రింద రూ. 20,00,000/- రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా తన హక్కుల కోసం పోరాటం చేసి సాదించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు శ్రీ షేక్ జావీద్, సొల్తీ సాయి కుమారు, గాదె శైలజ, మాధవి, బోట్ల పవన్, వేముల రాజు, మామిండ్ల చిన్న ఐలయ్య, కొయ్యడ కుమారస్వామి , ఎన్నమళ్ళ నర్సయ్య, మామిండ్ల పెద్ద ఐలయ్య, తంగేళ్ల ప్రభాకర్, తంగేళ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments