Friday, September 20, 2024
Homeవ్యవసాయంరెండు రోజులు భారీ వర్షం 

రెండు రోజులు భారీ వర్షం 

రెండు రోజులు భారీ వర్షం 

స్పాట్ వాయిస్, బ్యూరో: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతోపాటు వరంగల్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments