Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుటీయూ డబ్ల్యూ జే(ఐజేయు) సంతాపం

టీయూ డబ్ల్యూ జే(ఐజేయు) సంతాపం

టీయూ డబ్ల్యూ జే(ఐజేయు) సంతాపం..
స్పాట్ వాయిస్, బాలసముద్రం: ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మృతి మీడియా రంగానికి తీరని లోటని, సమాజం ఉత్తమ జర్నలిస్టును కోల్పోవడం బాధాకరమని టీయూ డబ్ల్యూ జే(ఐజేయు)హన్మకొండ జిల్లా శాఖ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ నాయకుడు దాసరి కృష్ణా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కంకణాల సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తోటి జర్నలిస్టులతో, ప్రజలతో ఎంతో సౌమ్యంగా వ్యవహరించే మృదుస్వభావి మెండు శ్రీనివాస్ అని.. ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని వారు విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు వారు తమ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments