Tuesday, November 26, 2024
Homeతెలంగాణటీయూలో విజిలెన్స్ అధికారుల దాడులు..

టీయూలో విజిలెన్స్ అధికారుల దాడులు..

అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు..
స్పాట్ వాయిస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప‌రిధిలోని తెలంగాణ యూనివ‌ర్సిటీలో విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వ‌ర్సిటీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో సోదాలు చేశారు. అవినీతి ఆరోప‌ణ‌ల దృష్ట్యా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించిన‌ట్లు అధికారులు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్లలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని రూసా భవనంలో ఈ నెల 3వ తేదీన‌ నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఇటీవల జరిగిన టీయూ పరిణామాలు, గతంలో పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్‌ గుప్తా మరోసారి డుమ్మాకొట్టారు. సమావేశంలో వీసీ చేసిన అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల పేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన వైనం, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి రూ. 28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తాపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments