Sunday, November 24, 2024
Homeకెరీర్గ్రూప్‌-1 సహా ఆరు పేపర్ల లీక్..

గ్రూప్‌-1 సహా ఆరు పేపర్ల లీక్..

గ్రూప్‌-1 సహా ఆరు పేపర్ల లీక్..

ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్‌షీట్లు కూడా కాపీ

ఫిబ్రవరి 27న తతంగం 

విచారణలో వెలుగు చూసిన నిజాలు

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కీలక అంశాలు బయటపడాయి. గ్రూప్‌-1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్‌ ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్‌షీట్లను కూడా కాపీ చేసుకున్నట్టు సిట్‌ విచారణలో నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. ప్రశ్నలతోపాటు సమాధానాలను కూడా మిగతా నిందితులకు ఇవ్వడంతో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి వారే పరీక్షలకు సిద్ధమైనట్టు వెల్లడైంది. కస్టోడియన్‌ సిస్టమ్‌ నుంచి ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి ఆరు పరీక్షలకు సంబంధించిన 15 ప్రశ్నపత్రాలను, వాటి సమాధానాలను కాపీ చేసుకున్నారు. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందే తమ వారికి ప్రశ్నపత్రం అందేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఈ విషయాన్ని గ్రూప్‌-1లో వందకుపైగా మార్కులు తెచ్చుకున్న సురేశ్‌, రమేశ్‌, షమీమ్‌కు విచారణలో వెల్లడించారు. ఈ ముగ్గురిని ఐదురోజుల కస్టడీకి తీసుకున్న సిట్‌ రెండోరోజు గురువారం విచారించింది. నిందితుల ఇండ్లలో సిట్‌ సోదాలు నిర్వహించింది. పరీక్షకు సిద్ధమైన ప్రశ్నపత్రాలు, సమాధానాల కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు మూడు జిరాక్స్‌ కాపీలు తీసుకొని, సమాధానాలు కూడా అక్కడే ఉండటంతో ఆయా ప్రశ్నలను బట్టి పట్టినట్టు సిట్‌ విచారణలోతెలిసింది.

ఫిబ్రవరి 27న..

కస్టోడియన్‌ సిస్టమ్‌ నుంచి గ్రూప్‌-1తోపాటు మరో ఐదు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు నిందితులు ఫిబ్రవరి 27న కాపీ చేసుకున్నారు. గ్రూప్‌-1, ఏఈ (6), ఏఈఈ (3), టౌన్‌ప్ల్లానింగ్‌(2), డీఏవో(2)తోపాటు జూనియర్‌ లెక్చరర్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు, వాటి సమాధాలున్నాయి. గ్రూప్‌-1 అక్టోబర్‌ మొదటివారంలో కాపీ చేసుకోగా, మిగతా పరీక్షలవి ఫిబ్రవరి 27న ప్రధాన నిందితులు కాపీ చేసుకున్నట్టు విచారణలో తేలింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments