Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్నెరవేరిన నిరుద్యోగుల డిమాండ్..

నెరవేరిన నిరుద్యోగుల డిమాండ్..

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి

జనార్దన్‌రెడ్డి రాజీనామా..

నెరవేరిన నిరుద్యోగుల డిమాండ్..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసైకి రిజైన్​ లెటర్ సమర్పించారు. జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. తదుపరి చర్యలు చేపట్టాలని సీఎస్‌ శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తరువాత జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు.

వరుస లీకులు

వరుస పేపర్‌లీకేజీలతో టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కొద్ది సేపటికే జనార్దన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

2021 నుంచి..

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి 2021 మేలో జనార్దన్‌ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం హయాంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments