ఏఈ ప్రశ్నాపత్రం విలువ రూ. 7.5 లక్షలకు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ లీక్ లో రోజుకో విషయం వెలుగు చూస్తోoది. ఏఈ ప్రశ్నాపత్రాన్ని రూ.7.5 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జిలో ఈ ఇద్దరిని ఉంచి పరీక్ష రాయించేందుకు శిక్షణ సైతం ఇప్పించారు. ఏఈ ప్రశ్నాపత్రాలు తొలుత ఈ ఇద్దరికే చేరినట్లు పోలీసులు భావించినా.. మరికొందరికి సైతం వీటిని రేణుక దంపతులు విక్రయించినట్లు కస్టడీ సమయంలో గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డి రూ.7.5 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Recent Comments