Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్పేపర్ లీకేజీ కేసు.. 30 మంది ఉద్యోగులకు నోటీసులు..

పేపర్ లీకేజీ కేసు.. 30 మంది ఉద్యోగులకు నోటీసులు..

పేపర్ లీకేజీ కేసులో 30 మందికి నోటీసులు..

అందరూ విచారణకు రావాలని ఆదేశాలు..

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దుకూడు పెంచింది. ఆఫీసులో పని చేస్తున్న 30 మంది ఉద్యోగులు విచారణ రావాలంటూ.. బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్ తో సన్నిహితంగా ఉన్న వాళ్లను ఎంక్వయిరీ చేయనున్నారు. పేపర్ లీకేజీలో వారి పాత్ర ఉందా.. వాళ్లు ఏమైనా సాయం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకే కాకుండా.. ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేయడంతో కేసులో మరిన్ని ఆధారాలు లభించనున్నాయి.

ఇక..కాన్ఫిడెన్షియల్ రూం సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి పాత్రపై లోతుగా విచారణ చేపట్టాలని సిట్ అధికారులు ఫిక్స్ అయ్యారు. గురువారం మరోసారి ఆమెను విచారణ చేయనున్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments