స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు టీఎస్పీఎస్ అవకాశం కల్పించింది. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ అవకాశం అందుబాటులోకి రానుంది. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లు ఏర్పడ్డాయి. దీంతో అభ్యర్థుల స్థానికత మారిపోయింది. ఇక నుంచి 1– 7తరగతులను ప్రామాణికంగా తీసుకొని స్థానికత పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు 1 నుంచి 7వ తరగతి వరకు 33 జిల్లాల్లో ఏ జిల్లాలో చదివారో పొందుపరిస్తే స్థానికత ఆటోమెటిక్‌గా మారిపోనుంది. దీంట్లో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మార్పులు చేసుకోవడంతో పాటు, కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Recent Comments