Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్మొత్తం.. మార్పు..

మొత్తం.. మార్పు..

మొత్తం.. మార్పు..
టీఎస్.. ఇక టీజీ
తెలంగాణ గీతం జయ జయహే..

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు

స్పాట్ వాయిస్, బ్యూరో : రేవంత్ సర్కార్ సచివాలయంలో సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపింది. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రి వర్గం. ఇందులోభాగంగా.. ఇక నుంచి టీఎస్‌ను టీజీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీగా రిజిస్ట్రేషన్‌ జరగనున్నట్టు మంత్రులు తెలిపారు.

జయ జయహే

అందెశ్రీ రాసిన జయ జయహే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసినట్టు వివరించారు. రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ మార్పులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న రూపాన్ని తీసుకొస్తామని మంత్రులు వివరించారు. వీటి మార్పుల విషయంలో.. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని, ప్రజల అభీష్ఠం మేరకు మార్పులు చేయనున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. మరోవైపు.. ఎన్నికలప్పుడు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల గణన కూడా చేపట్టే విషయంపై చర్చించిన కేబినెట్.. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments