శ్వేతపత్రాన్ని విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి
2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు
స్పాట్ వాయిస్, బ్యూరో : నాలుగు రోజుల విరామం అనంతరం బుధవారం శాసనసభలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం 42 పేజీలతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లుగా చూపించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉన్నది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లుగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రం
Recent Comments