Saturday, November 23, 2024
Homeరాజకీయంఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతం

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతం

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతం
నిజామాబాద్ ఎంపీ అర్వింద్
స్పాట్ వాయిస్, కరీంనగర్: ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైతదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఐదో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ గురువారం నిర్వహించగా అర్వింద్ మాట్లాడారు. బీఆర్ఎస్ కు సిద్దాంతం, ఎజెండా అంటూ ఏమీ లేదని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకే బీఆర్ఎస్ ఏర్పాటని ఆరోపించారు. ఈ విషయం కార్యకర్తలకు తెలిసింది కానీ..నాయకులే మేల్కోవాలన్నారు. బీఆర్ఎస్ తో కేసీఆర్… దేశమంతా తిరుగుతూ కేటీఆర్ కు రాష్ట్రం అప్పగిస్తాడట.. సినీ నటులతో, రాత్రి మ్యూజిక్ లు వినడం తప్ప కేటీఆర్ ప్రజల్లోకి రాడని అర్వింద్ ఎద్దేవా చేశారు.ఇక మొన్నటి దాకా తనని వేటాడి, వెంటాడి ఓడిస్తానన్న కవిత.. ఇప్పుడు తన తండ్రి చెప్పిన చోట పోటీ చేస్తుందట.. కవిత తన మీద పోటీ చేయాలని, ధైర్యం లేకపోతే కేసీఆర్ ను ఇందూరు నుంచి పోటీకి దిగామని చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. బీజేపీ వస్తేనే అవినీతి రహిత పాలన వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారు లక్ష్యంగా పని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments