ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం
గులాబీ శ్రేణుల్లో జోష్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ ఏడాది దసరా పర్వదినం రోజున సీఎం కేసీఆర్ పార్టీ తరఫున లేఖ రాసిన విషయం విధితమే. ఎట్టకేలకు కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్
RELATED ARTICLES
Recent Comments