Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ప్యాడి X పవర్

ప్యాడి X పవర్

కేంద్రం-రాష్ర్టం ఢీ
ధాన్యం కోసం టీఆర్ఎస్ ఫైట్
విద్యుత్ చార్జీల పెంపుపై కేంద్ర లొల్లి
వేడెక్కిన రాజకీయం
ఆందోళనలు, ధర్నాలకు పిలుపు
ప్రతీఅంశాన్ని ప్లస్ చేసుకునే పనిలో పార్టీలు
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: రాష్ర్టం గులాబీ, కాషాయం లొల్లి మధ్య అట్టుడికిపోతోంది. రోడ్లపై రాజకీయ వేడి నిప్పులు కురిపిస్తోంది. ఢీ అంటే ఢీ అంటూ పోరుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ సర్కార్ ప్యాడి కొనాలంటూ రైతులను సిద్ధం ఆందోళనకు సిద్ధం చేస్తుంటే.. బీజేపీ పవర్ చార్జీలు పెంచారంటూ ప్రజలందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. వీరిద్దరూ సవాళ్లు, ఆందోళనలు చూస్తే ఓట్ల రాజకీయం మొదలైందనేది స్పష్టం తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల ఫైట్ లో ఎవరూ ప్రజల అభిమానాన్ని చూరగొట్టారో చూడాలి మరి.
ఢిల్లీ దద్దరిల్లేలా..?
రాష్ర్ట ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపి కేంద్ర మంత్రులను కలువాలని నిర్ణయించింది. అయితే కేంద్రం ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వ డిమాండ్ పక్కన పడేసింది. యాసంగి సీజన్ లో వచ్చిన ధాన్యం మొత్తాన్ని సేకరించడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. సేకరణ అనేది కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్ ధరల మేరకు ఉంటుందని చెప్పింది. దీంతో తెలంగాణ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా బుధవారమే విలేకరుల సమావేశం పెట్టి కేంద్రంపై నిప్పులు చెరిగారు. అధినేత ఇటీవల పిలుపునిచ్చిన ధర్నాలు, ఆందోళనలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీ దద్దరిల్లేలా నిరసనలు తెలుపాలని, రైతులను జాగృతం చేసి భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు, చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
కారు వెనక్కి తగ్గేదాకా..
రాష్ర్ట ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ర్ట సర్కార్ కావాలనే ప్రజలపై భారం మోపుతోందని మండిపడుతోంది. అంతేకాకుండా రాష్ర్టంలోనూ కాషాయం జెండా ఎగురవేయాలనే ఉద్ధేశంతో ఆ పార్టీ.. కారుతో ప్రతీ అంశంలోనూ పోటాపోటీగా ఉంటోంది. ‘పవర్’లోకి రావాలనే ఉద్దేశంతో గట్టిగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతీ దాన్ని అనువుగా మలుచుకుంటోంది. అయితే కేంద్రం, రాష్ర్టం ఫైట్ లో ఎవరు నెగ్గుతారనేది చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments