సొసైటీ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం
స్పాట్ వాయిస్ ఖానాపూర్ : అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సొసైటీ డైరెక్టర్ ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన ఘటన ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అశోక్ నగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, ఖానాపూర్ సొసైటీ డైరెక్టర్ గంగాధరి రమేష్ మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాంట్రాక్టు పనులు చేసే రమేష్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం వెనుక గతంలో చేసిన పనుల బిల్లుల చెల్లింపులో ఆలస్యమేమైనా కారణమా అని పలువురు చర్చించుకుంటున్నారు. తెల్లవారితే నర్సంపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకుడు ఇలా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది.
Recent Comments