Monday, November 25, 2024
Homeలేటెస్ట్ న్యూస్హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవ‌స్థాప‌క దినోత్సవం

హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవ‌స్థాప‌క దినోత్సవం

27న నిర్వహించేందుకు ఏర్పాట్లు
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరుకావాలని అధినేత పిలుపు
స్పాట్ వాయిస్, బ్యూరో: టీఆర్ఎస్ వ్యవ‌స్థాప‌క దినోత్సవ వేడుకకు పార్టీ సిద్ధమైంది. ఏప్రిల్ 27వ తేదీన మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించాల‌ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు హెచ్ఐసీసీకి చేరుకోవాల‌ని పార్టీ ప్రతినిధులంద‌రికీ సీఎం సూచించారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రివ‌ర్గంతో పాటు లోక్‌స‌భ‌, రాజ్యస‌భ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేష‌న్ల చైర్మన్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా ప‌రిష‌త్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాల‌యాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు స‌మితి అధ్యక్షులు, మ‌హిళా కోఆర్డినేట‌ర్లు, జెడ్పీటీసీ స‌భ్యులు, మున్సిప‌ల్ మేయ‌ర్లు, చైర్మన్లు, మండ‌ల ప‌రిష‌త్ అధ్యక్షులు, ప‌ట్టణాల‌, మండ‌లాల పార్టీ అధ్యక్షులు, వ్యవ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మన్లు హాజ‌రు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రవుతారు.
కార్యక్రమం ఇలా..
ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ ప్రతినిధుల పేర్ల న‌మోదు కార్యక్రమం కొన‌సాగనుంది. ఉద‌యం 11:05 గంట‌ల‌కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంత‌రం స్వాగ‌తోప‌న్యాసం ఉంటుంది. ఆ త‌ర్వాత అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాల‌ను ప్రవేశ‌పెట్టనున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments