TRS మళ్లీ వస్తోంది..!
ప్రాంతీయ పార్టీగా మళ్లీ ప్రారంభం..?
బీఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా పొంగులేటి భారీ స్కెచ్..!
స్పాట్ వాయిస్, ఖమ్మం: పొగులేటి శ్రీనివాస్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ ల్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన మాత్రం ఏ పార్టీలో చేరేది ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఆయా పార్టీల నాయకులతో సుదీర్ఘ చర్చలు చేశారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లేది ఇప్పటి వరకు చెప్పలేదు. 2023 జనవరి నుంచి ఆయన బీఆర్ఎస్ రెబల్ గా మారాడు. అప్పటి నుంచి ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజలు, నాయకుల నుంచి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట నడిచే బీఆర్ఎస్ నేతలపై వేటు సైతం వేశారు.
అభ్యర్థుల ప్రకటన
ఖమ్మం జిల్లా పరిధిలో కొద్ది రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. పినపాకలో మొదలైన విమర్శలు నేటికీ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేసి పినపాక, వైరా, ఇల్లందు, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా మండలాల్లో పొంగులేటి శ్రీనన్న పేరుతో కార్యాలయాలు ఓపెన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకముందే ఆయన తన అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన ఇప్పటికే ఉన్న పార్టీలో చేరుతారా…? లేక కొత్త పార్టీ పెడుతారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త పార్టీ.. !
పొంగులేటి శ్రీనివాస్ ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలోని 10 నియోజకవర్గాలు ఉండగా.. 5 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఏ పార్టీలో చేరిన ఆయన అనుచరులకు టికెట్ ఇవ్వాలనే సంకేతమా..? లేక ఆయనే కొత్త పార్టీ పెట్టి రాష్ట్రంలో కీలక భూమిక పోషించాలనే ఆలోచన నేటికీ అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, అందులోనూ బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చేలా తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరా పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఓ బ్రాండ్. ఆ పేరుతో ఆయన తన వర్గాన్ని గెలిపించుకొని అసెంబ్లీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు పొంగులేటి అనుచరులు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్ తో ఓట్లను సునాయాసంగా కొల్లగొట్టవచ్చనే యోచనలో భాగంగానే తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recent Comments