బీజేపీలోకి బూర..?!
‘మునుగోడు’ ఆశించి భంగపడ్డ నర్సయ్యగౌడ్
నేడో, రేపో అమిత్ షాను కలిసేందుకు ప్లాన్
ఆ తర్వాత అధికార ప్రకటన..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వేడి రగులుకుంటోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతూనే ఉన్నాయి. అవకాశం చిక్కిన ఏ విషయాన్ని వదలకుండా ప్రచారంలో సిగపట్లు పడుతున్నాయి. ఈ సమయంలోనే టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గుడ్ బై చెప్పబోతున్నాడనే వార్త ఆ పార్టీని మరింత ఇరకాటంలో పడేసింది. బూర నర్సయ్య గౌడ్ 2014లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి గెలుపొందగా, 2019లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం మునుగోడు స్థానాన్ని కేటాయిస్తారని గంపెడాశతో ఉన్న బూరకు ఆ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. అప్పటి నుంచి నర్సయ్య గౌడ్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లారని, త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అధికారికంగా పార్టీలో చేరే ప్రకటన వెలువరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఉప ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ కు భారీ షాక్..
RELATED ARTICLES
Recent Comments