గులాబీ పార్టీలో లుకలుకలు..
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే…
మానుకోటలో మాట పట్టింపులు..
తూర్పులోనూ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : మానుకోట ‘కారు’లో ఇదేమి కొత్త కాదు. అందరూ అనుకుంటున్నదే.., అందరికీ తెలిసిందే. కానీ, అందరిముందే మరోమారు ప్రత్యక్షంగా జరగడమే ప్రత్యేకం. అధినేత పిలుపుమేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షకు దిగాయి. కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనే వరకు ఉద్యమం ఆపేదే లేదనే ప్రత్యేక నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలుచోట్ల గులాబీలోని లుకలుకలు బహిర్గతమయ్యాయి. పైకి అంతా బాగానే కనిపిస్తున్న కారు ప్రయాణంలో లోపలి దృశ్యాలను బట్టబయలు చేశాయి. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన దీక్షలోని ఘటన అందరిని ఆలోచనలో పడేసింది. టీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాల్ని కళ్లముందు సాక్షాత్కరించింది. స్వయంగా మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే విభేదాలు బయటపడడం మరింత ఆసక్తికరంగా మారింది.
వివరాలిలా ఉన్నాయి..
మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్ కవిత నియామకమైన విషయం తెలిసిందే. కాగా, గురువారం నాటి దీక్షలో జిల్లా అధ్యక్షురాలి హోదాలో కవిత మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలోని మైక్ ను లాక్కున్నారు. ‘‘నేను మాట్లాడుతున్నా కదా..’’ అని కవిత అంటుండగానే ‘‘మేము మాట్లాడుతాం కదా..’’ అని ఆమె చేతిలోని మైక్ ను బలవంతంగా తీసుకుని స్టేజీ ఎక్కి మాట్లాడడం మొదలు పెట్టారు. దీంతో ఎంపీ కవిత ఏం చేయాలో పాలుపోక అటు జనాలను చూస్తూ, ఇటు పక్కనే ఉన్న తండ్రి రెడ్యా నాయక్ ను చూస్తూ అక్కడే కూర్చున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావుకు విషయాన్ని చెప్పినట్టు సమాచారం. కాగా, ఈ ఇష్యూ జరగడానికి ముందు మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్యక్షతన జరుగుతున్న అని అనగానే, పక్కనే ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కలుగజేసుకుని పార్టీ జిల్లా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న అని చెప్పాలని సూచించడంతో ఆ వ్యవహారం అప్పటితో సద్దు మనిగింది. కాగా, శంకర్ నాయక్ చేసిన పనితోనే స్టేజీపై ఉన్న వారితో పాటు దీక్షకు హాజరైన వారు కూడా ఒక్కసారిగా కాసింత షాక్ కు గురయ్యారు.
వరంగల్ సభలో…
వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన దీక్ష శిబిరానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి స్టేజీ పైన మాట్లాడుతున్నంత సేపు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తమ ప్రజాప్రతినిధి ఎక్కడా.. అని జనాలు చర్చించుకోవడం కనిపించింది. అదీ కాక మంత్రి మాట్లాడి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఎమ్మెల్యే నన్నపునేని కార్యక్రమానికి రావడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. ఒకానొక దశలో అసలేం జరుగుతోందోనని అర్థం కాక తలలు పట్టుకున్నారు. తూర్పులో ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం చాపకింద నీరులా పారుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. నేటి దీక్ష శిబిరంలోని పరిణామాలతో అది తారాస్థాయికి చేరేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలు లేవని తేలిపోయింది. కాగా, క్రమశిక్షణకు మారుపేరైన అధినేత దృష్టికి ఈ ఇష్యూలు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి అని ఆయా వేదికల వద్ద దీక్షకు హాజరైన రైతులు, పలువురు పార్టీ కార్యకర్తలు చర్చించుకోవడం వినిపించింది.
కారు’లో గిదేంది..?
RELATED ARTICLES
Recent Comments