స్పాట్ వాయిస్,మహా ముత్తారం: టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ హెచ్ ఐ సీసీలో నిర్వహించిన ప్లీనరీ సమావేశానికి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు తరలి వెళ్లారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో మహా ముత్తారానికి చెందిన ముఖ్య నాయకులు వెళ్లారు. వారితో పాటు మంథనికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల అధ్యక్షులు ప్లీనరీలో పాల్గొనగా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వారితో పాటే కూర్చుని సమావేశాన్ని వీక్షించారు. మహా ముత్తరం మాజీ జెడ్పీటీసీ, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్, పలువురు నాయకులు తరలివెళ్లారు.
Recent Comments