స్పాట్ వాయిస్, వరంగల్: నగరంలో ని 28వ డివిజన్ లో శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. డివిజన్ లోని పిన్నవారి స్ట్రీట్ లో డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు ప్రతీ కార్యకర్త నిబద్ధతతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments