టీఆర్ పీఎస్ మండల అధ్యక్షుడిగా సామల మధుసూదన్
పలువురి శుభాకాంక్షలు
స్పాట్ వాయిస్, శాయంపేట : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్ పీఎస్) మండల అధ్యక్షుడిగా కొప్పుల గ్రామానికి చెందిన సామల మధుసూదన్ ఎన్నికయ్యారు. ఆదివారం శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో టీఆర్ పీఎస్ మండల అధ్యక్షుడిగా సామల మధుసూదన్ ఎన్నికయినట్లు టీఆర్ పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ఎన్నికల అధికారి డాక్టర్ చందా మల్లయ్య ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొని మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సామల మధుసూదన్ ను రాష్ట్ర సలహాదారులు బాసాని చంద్రప్రకాశ్, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు బిల్లా యాదగిరి తదితరులు అభినందించారు.
ఈ సందర్భంగా టీఆర్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, శాయంపేట మండల నూతన అధ్యక్షుడు సామల మధు సూదన్ మాట్లాడుతూ స్వర్గీయ రామా శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా మండలంతోపాటు వివిధ గ్రామాల పద్మశాలి ప్రముఖులను, కుల పెద్దలను కలుపుకుని, వారి సలహాలు, సూచనలతో పద్మశాలి కులబాంధవులు అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. బీద పద్మశాలి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు. మండల వ్యాప్తంగా పర్యటించి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్ పీఎస్) బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తానని పేర్కొన్నారు. త్వరలో మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కాగా, మండల కమిటీ ఎన్నికలకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. మండల కమిటీ ఎన్నిక కోసం నాకు వెన్నుదన్నుగా నిలిచిన వావిలాల వేణు, పల్నాటి జలెందర్, గుర్రం అశోక్, దుంపేట్ రమేష్, కందకట్ల ప్రకాష్, దుంపేటి రమేష్, సామల భిక్షపతి, బూర పైడి, బూర ఈశ్వరయ్య, అల్లె రాజీరు, బాసని లక్మి నారాయణ తోపాటు ముఖ్యంగా పద్మశాలి కులంబాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
Recent Comments