Saturday, November 23, 2024
Homeజనరల్ న్యూస్నాణ్యమైన విద్యే ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల లక్ష్యం

నాణ్యమైన విద్యే ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల లక్ష్యం

నాణ్యమైన విద్యే ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల లక్ష్యం
మంత్రి సత్యవతి రాథోడ్
అశోక్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో స్టేట్ కల్చరల్ ఫెస్ట్ “ఎత్నోవా 2022”
స్పాట్ వాయిస్, నర్సంపేట (ఖానాపురం) : నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణతో కూడిన నైతిక విలువలు పెంపొందించడమే ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో బుధవారం స్టేట్ కల్చరల్ ఫెస్ట్ “ఎత్నోవా 2022” ను నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి గిరిజనుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పాటుపడుతున్నాడని అభినందించారు. రాష్ట్రంలో 1100 గురుకులాలు ఉంటే అందులో 186 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఎక్కడా తీసిపోకుండా గిరిజన బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్లేందుకు లా కోర్సులతో పాటు, ఉన్నత చదువుల కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన విద్యార్థులు అనేక ఉన్నత స్థాయి యూనివర్సిటీల్లో సీట్లు సాధించడంతో పాటు 273 మందికి మెడికల్ సీట్లు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో ఎనిమిది గురుకులాలతోపాటు ట్రైబల్ వెల్ఫేర్, సైనిక్ స్కూల్ ఏర్పాటు అప్ గ్రెడేషన్ తో నర్సంపేటను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. సైనిక్ స్కూల్ అభివృద్ధి కోసం పాటుపడతామని, అదనపు బిల్డింగ్ నిర్మాణం చేపట్టి, సైనిక్ స్కూల్ లోపల సీసీ రోడ్లను త్వరలో నిర్మిస్తామన్నారు. వెల్ఫేర్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కల్చరల్ ఫెస్ట్ కు రాష్ట్రంలోని వివిధ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటపాటలు, యూత్ పార్లమెంట్ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, ఓడీసీఎం ఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్ రావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమా ఉపేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, సైనిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్, స్టాఫ్, ఆర్సీవో లు, నాయకులు బత్తిని శ్రీనివాస్, బండి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments