Monday, September 23, 2024
Homeలేటెస్ట్ న్యూస్మునుగోడు దెబ్బకు ఢిల్లీలో వణుకు

మునుగోడు దెబ్బకు ఢిల్లీలో వణుకు

ప్రజలకు టీఆర్ఎస్ తరుఫున కృతజ్ఞతలు
మంత్రి కేటీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: మునుగోడు దెబ్బకు ఢిల్లీలోని పెద్దలకు వణుకుపుట్టిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో.. ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. నవంబర్‌ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి కేసీఆర్‌ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. గెలుపు కోసం వేలాదిగా పని చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్‌ మీడియా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కార్యకర్తలు, శ్రేణులను అద్భుతంగా నడిపించిన, కీలకపాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావు ధన్యవాదాలు చెప్పారు.
బీజేపీకి చెక్కరొచ్చింది
‘2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్‌నగర్‌, నాగార్జున సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నల్లగొండ గడ్డపై మొట్టమొదటి సారిగా 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారన్నారు. అహంకారం, డప్పు మదం, రాజకీయ కళ్లునెత్తికెక్కి, పొరుగుతో బలవంతుపు ఉప ఎన్నిక ఉప ఎన్నికను తెలంగాణ, మునుగోడు ప్రజలపై రుద్దింది ఢిల్లీ బాస్‌లు నరేంద్ర మోడీ, అమిత్‌షా.. ఇద్దరి అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచారన్నారు. రుద్దిన ఎన్నికను.. రుద్దిన వారికే మీరు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చిందని తెలిపారు. ఉప ఎన్నికను ధనమయం చేయాలని..ప్రజల గొంతను నొక్కాలని ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టాలరన్నారు. కుట్రలు, కుతంత్రాలు, ఫేక్ ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. కారును పోలిన గుర్తులకు 6 వేల ఓట్లు వచ్చాయని..లేకుంటే తమ అభ్యర్థికి 16 వేల ఓట్ల మెజార్టీ వచ్చేదన్నారు. డబ్బు, అధికారం, అహంకారంతో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేశారని ఆరోపించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో తెలంగాణపై కూడా కృరమైన రాజకీయ క్రీడకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments