ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 278కి చేరగా… మరో 900 మందికి పైగా గాయాలయ్యాయి. రైల్వే అధికారులు, ఆర్మీ సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి ప్రకటించారు.
ఏం జరిగిందంటే..
శుక్రవారం బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో షాలీమార్ – చెన్నై సెంట్రల్ మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొని పట్టాలు తప్పింది. ఈ రైలు బోగీలు పక్కనే మరో ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో అటువైపు నుంచి వచ్చిన బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో యశ్వంత్‌పూర్-హౌరా రైలు బోగీలు 3-4 పట్టాలు తప్పాయి.
ఘటన స్థలానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి..
ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలపై ఫోకస్ పెట్టామని చెప్పారు.
రూ.10 లక్షల పరిహారం..
మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Recent Comments