Tuesday, April 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్స్పాట్ ఫ్లాష్.... ఆ రైళ్లలో బాంబు పెట్టాం...

స్పాట్ ఫ్లాష్…. ఆ రైళ్లలో బాంబు పెట్టాం…

ఆగంతకుడి ఫోన్..
కాజీపేటలో ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ నిలిపివేత
స్పాట్ వాయిస్, కాజీపేట: విశాఖ నుంచి వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతుకుడి రైల్వే పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే రక్షక దళం పోలీసులు కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి తనిఖీ చేశారు. అలాగే చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేసి చెక్ చేస్తున్నారు. బోగీల్లో పోలీసులు జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పద వస్తువులు తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ప్రయాణికుల నుంచి అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments