సంగెం మండలంలో విషాదం
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చావులోనూ ఆ భార్యాభర్తల బంధం వీడలేదు. భర్త చనిపోయాడని తెలిసిన 10 నిమిషాలకే భార్య సైతం మరణించింది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూర కట్టయ్య (75 ) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కమలమ్మ (65) గుండెపోటుతో కుప్పకూలిపోయింది. మృతి చెందిన వృద్ధ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Recent Comments