Sunday, April 20, 2025
Homeతెలంగాణమేడారంలో మరో విషాదం..

మేడారంలో మరో విషాదం..

వరుసగా పూజారుల మృత్యువాత
మొన్న సమక్క ప్రధాన పూజారి..నేడు సారలమ్మ పూజారి
స్పాట్ వాయిస్, ములుగు: మేడారం పూజారులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. ఒకరి వెనుక ఒకరు చనిపోతున్నారు. మొన్నటిమొన్న సమక్క ప్రధాన పూజరి మల్లెల ముత్తయ్య మరణించగా.. నేడు సారలమ్మ పూజారి కాక సంపత్ మృతిచెందాడు. ములుగు జిల్లా సమ్మక్క -సారలమ్మ తాడ్వాయి మండలంలోని ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధి కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి కాక సంపత్ మృతి చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంపత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంపత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకన్నాయి. కాగా, ఇటీవలే మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) కూడా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments