బావిలో పడి బాలుడి మృతి
రేపాకలో విషాదం
స్పాట్ వాయిస్, రేగొండ: పచ్చని పెళ్లి పందిరితో కళకళలాడాల్సిన వాకిలి శవాన్ని పడుకోబెట్టే గడ్డితో నిండిపోయింది. అక్కాబావ బరాత్ లో డ్యాన్స్ చేయాల్సిన తమ్ముడు విగతజీవిగా ఇంటికి చేరాడు. ఇంటిళ్లిపాది పెళ్లి పనుల్లో మునిగి తేలగా, తోటి స్నేహితులతో ఈతకు వెళ్లిన ఆ ఇంటి వారసుడు నీటమునిగి అందరినీ విషాదంలో ముంచాడు. రేగొండ మండలం రేపాకలో చోటు చేసుకున్న ఘటన హృదయాలను మెలిపెట్టింది. గ్రామానికి చెందిన సిద్ధ వినోద, సదయ్య దంపతుల కుమారుడు గణేష్ సోమవారం బావిలో మునిగి మరణించాడు. ఈ నెల 17న గణేష్ అక్క పెళ్లి ఉండగా, అబ్బాయి మరణంతో ఈ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
Recent Comments