పలు మార్గాల్లో దారి మళ్లింపు..
వాహనదారులు సహకరించాలి..
పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో 18వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు వేలాదిగా పోటెత్తే అవకాశం ఉన్నందునా ట్రాఫిక్ మళ్లింపునకు నిర్ణయించినట్టు చెప్పారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి సహకరించాలని సీపీ కోరారు.
ట్రాఫిక్ ఏరియాలు..
• ములుగు, పరకాల వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు, మిగితా వాహనాలు పెద్దమ్మగడ్డ, కేయూసీ క్రాస్, పోలీసు హెడ్ క్వార్టర్స్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా హన్మకొండ బస్టాండ్ కు రావాలన్నారు.
• హన్మకొండ బస్టాండ్ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ఏసియన్ శ్రీదేవి మాల్, అంబేడ్కర్, పోలీసు హెడ్ క్వార్టర్స్ జంక్షన్, కేయూసీ క్రాస్ మీదుగా వెళ్లాలి.
• హన్మకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట్, తొర్రూర్, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్లాలి.
• వరంగల్ బస్టాండ్ నుంచి పోస్టాఫీస్, శివ నగర్, పోతన రోడ్, సంతోష్ మాత టెంపుల్, సీఎస్ఆర్ గార్డెన్, హంటర్ రోడ్, అదాలత్ మీదుగా వెళ్లాలి.
• ములుగు క్రాస్ రోడ్ నుంచి హన్మకొండ వైపు వెళ్లే మోటార్ సైకిళ్లు, కార్లు , ఆటోలు, ఇతర వాహనాలు అలంకార్, కాపువాడ మీదుగా హన్మకొండ బస్టాండ్ వైపు వెళ్లాలి.
• ములుగు క్రాస్ రోడ్ నుంచి హన్మకొండ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు , పెద్దమ్మగడ్డ, కేయూసీ క్రాస్ పోలీసు హెడ్ క్వార్టర్స్ మీదుగా బస్టాండ్ వెళ్లాలి.
• హన్మకొండ నుంచి వరంగల్ వైపు వెళ్లే మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు మర్కజీ రోడ్డు, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ రోడ్డు ద్వారా వెళ్లాలి.
Recent Comments