- ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం..
- వాహనదారుడి బట్టలు చింపిన వైనం.
- స్పాట్ వాయిస్, హన్మకొండ: ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. వాహన తనిఖీల పేరిట ఓ వాహనదారుడి బట్టలు చింపిన ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది. తనపై అనవసరంగా చేయి చేసుకున్నారని బాధితుడు నిరంజన్ తెలిపాడు. వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉందని వెల్లడించారు. అయినా వినకుండా తనపై చేయిచేసుకోవడమే కాకుండా.. బూతులు తిట్టారని, తన బాబాయ్ ఏసీపీ అని చెప్పిన వినలేదన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recent Comments