Tuesday, September 17, 2024
Homeజిల్లా వార్తలురేపే గురువందనo..

రేపే గురువందనo..

తపస్ ఆధ్వర్యంలో ఉత్తములకు సన్మానం
విశిష్ఠ ఉపాధ్యాయుల పురస్కారాల అందజేత
వరంగల్, హన్మకొండ జిల్లాల ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
స్పాట్ వాయిస్, హన్మకొండ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఆదర్యంలో వ్యాసపూర్ణిమ సందర్భంగా ప్రతిఏటా గురు వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి విశిష్ట ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తపస్ వరంగల్, హన్మకొండ జిల్లాల శాఖలు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు రెండు జిల్లాల ప్రధాన కార్యదర్శులు ఉప్పుల సతీష్, డాక్టర్ సంగెం శ్రీనివాస్ శనివారం ప్రకటనలో తెలిపారు. వారికి ఆదివారం హన్మకొండలోని ఏబీవీపీ కార్యాలయం (సామజగన్మోహన్ రెడ్డి మెమోరియల్ హాల్ ) లో అతిథులు పురస్కారాలు అందజేస్తారని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి తపస్ జిల్లా హన్మకొండ అధ్యక్షుడు బత్తిని వీరస్వామి గౌడ్ సభాధ్యక్షులుగా, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటరమణ గౌడ్ సమన్వయ కర్తగా, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పారిపెల్లి శంకర్ ప్రధాన వక్తగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. అలాగే హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి, వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. జ్యా్ననేశ్వర్ విశిష్ట అతిథులుగా, ఆత్మీయ అతిథులుగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హన్మంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవాత్ సురేష్, బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ సెల్ స్టేట్ కో ఆర్ఢినేటర్ పులి సరోత్తంరెడ్డి హాజరుకానున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా హన్మకొండ ఏఎంవో ఎ.శ్రీనివాస్, వరంగల్ ఏఎంవో యు.సుజన్ తేజ హాజరుకానున్నారు. తపస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మునికుంట్ల సంగెం శ్రీనివాస్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల సతీష్ తోపాటు ఆయా జిల్లాల కార్యవర్గ సభ్యులు అతిథులకు ఘన ఆహ్వానం పలుకనున్నారని పేర్కొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలిలా ఉన్నాయి.

…………………………………….
** వరంగల్ జిల్లా **
……………………………………..
* వరంగల్ మండలం..
1) బి.రవికుమార్ జీహెచ్ఎస్ కృష్ణ కాలనీ వరంగల్
2) ఎన్ ఉపేందర్ జీపీఎస్ నరేంద్ర నగర్ వరంగల్

* ఖిలా వరంగల్ మండలం
1) బండ రవికుమార్, జీహెచ్ఎస్ శంభునిపేట
2) రామా వివేకానంద, పీఎస్ శంభునిపేట
3) ఎన్.విజయలక్ష్మి, జెడ్ పీ హెచ్ ఎస్ మామునూరు క్యాంప్

* సంగెం మండలం
1) ఎన్. సాంబమూర్తి ఎస్ జీటీ యూపీఎస్ ఆశాలపల్లి
2) పి.శ్రీనివాస్, జెడ్ పీ హెచ్ ఎస్ తిమ్మాపూర్

* గీసుకొండ మండలం
1) పి.ఉషారాణి, పీఎస్ గీసుకొండ
2) వి.మల్లయ్య, జెడ్ పీ హెచ్ ఎస్ గీసుగొండ

* రాయపర్తి మండలం 
1) బిల్లా రవికుమార్, జెడ్పీహెచ్ఎస్ తిరుమలాయపాలెం
2) పి.పద్మావతి

* వర్ధన్నపేట మండలం
1) అనిల్, జెడ్ పీ హెచ్ ఎస్ వర్ధన్నపేట
2) పద్మ, పీఎస్ కట్రియల్

* పర్వతగిరి మండలం
1) రాధిక పీఎస్ గుంటూరు పల్లి
2) జిశిరీష పీఎస్ వడ్లకొండ

* నెక్కొండ మండలం 
1) జి.దేవిలాల్ పీఎస్ మామిడి తోట తండా
2) ఎం. రేణుక జడ్ పీహెచ్ ఎస్ అలంకాని పేట
3) బి.ఉదయశ్రీ మోడల్ స్కూల్ నెక్కొండ

* చెన్నారావుపేట మండలం
1) జి.సుందర్ జడ్ పీహెచ్ ఎస్ ఉప్పరపల్లి
2) కొండ గంగాధర్, పీఎస్ లింగాపురం

* నర్సంపేట మండలం
1) సుంకరి సుజాత, పీఎస్ నర్సంపేట
2) ఎస్. గోపాల్ రావు జడ్ పీ హెచ్ ఎస్ బాయ్స్ నర్సంపేట

* దుగ్గొండి మండలం
1) సీహెచ్ రాందాస్, జెడ్ పీ హెచ్ఎస్ మహమ్మదాపురం
2) జి. ఉమా యూపీఎస్ అడవి రంగాపూర్

* ఖానాపూర్ మండలం
1) బి. శశికుమార్ , జడ్ పీహెచ్ ఎస్ ఖానాపూర్
2) బి. తిరుమల్ పీఎస్ కీరియా తండా
3) నాంపల్లి రాజశేఖర్, జడ్ పీ హెచ్ ఎస్ దబీర్ పేట్

* నల్లబెల్లి మండలం
1) ఆకుల కళాదేవి, పీఎస్ బుచ్చిరెడ్డిపల్లి
2) అన్నా మహేందర్ యూపీఎస్ అరవయ్య పల్లి

…………………………………….
** హన్మకొండ జిల్లా **
……………………………………..
* ఎల్కతుర్తి మండలం
1) ఎం. రామకృష్ణ గౌడ్, ఎస్ జీటీ ఎంపీపీఎస్ కేశవాపూర్
2)ఆర్. రవీందర్ ఎస్ ఏ జెడ్ పీహెచ్ ఎస్ గోపాల్ పూర్
3) తాడూరి రమేష్, ఎస్ ఏ జెడ్ పీ హెచ్ ఎస్ వల్బాపూర్

* కమలాపూర్ మండలం
1) ప్రతాపగిరి శ్రీనివాస్ హెచ్ పీటీ -1 యూపీఎస్ పంగిడిపల్లి

* భీమదేవరపల్లి మండలం
1) పి. శారద ఎస్ జీటీ ఎంపీపీ ఎస్ బీజే కాలనీ ముల్కనూర్
2) కొండ రవీందర్ ఎస్ ఏ జడ్ పీ హెచ్ ఎస్ మల్లారం

* నడికుడ మండలం
1) ఆత్మకూరు రాజేందర్, ఎస్ ఏ జెడ్ పీ హెచ్ఎస్ కౌకొండ
2) రాంపిష శివ కుమార్, పీడీ జెడ్ పీ హెచ్ ఎస్ నడికుడ

* హనుమకొండ మండలం
1) ఎస్. రమాదేవి, ఎస్ ఏ జీజీహెచ్ ఎస్ హనుమకొండ
2) పి. లలిత ఎస్ జీటీ జీపీఎస్ సమ్మయ్య నగర్

* కాజీపేట మండలం
1) ఆసనాల మహేష్ ఎస్ ఏ జీజీహెచ్ ఎస్ కాజీపేట
2)ఎస్. కృష్ణారావు ఎస్ జీటీ గౌట్ ఎయిడెడ్ వేలంగిణి యూపీఎస్ కాజీపేట
3) పి.వాణి ఎస్ జీటీ జీపీఎస్ సోమిడి

* ఆత్మకూరు మండలం
1) కృష్ణమూర్తి ఎస్ ఏ జెడ్ పీహెచ్ ఎస్ నీరుకుల్ల
2)ఎం. జనార్దన్ రెడ్డి ఎస్ జీటీ ఎంపీపీఎస్ అక్కంపేట

* పరకాల మండలం
1) కె.మేనక ఎస్ ఏ జెడ్ పీహెచ్ ఎస్ నాగారం
2) డి. రాజిరెడ్డి ఎస్ జీటీ ఎంపీపీఎస్ అలియాబాద్
3) కె.పద్మ ఎస్ ఏ జెడ్ పీహెచ్ ఎస్ గర్ల్స్ పరకాల

* ధర్మసాగర్ మండలం 
1) డి.సరస్వతి ఎస్ఏ జెడ్ పీహెచ్ ఎస్ గర్ల్స్ ధర్మసాగర్
2)ఎ.సునీత ఎస్ జీటీ ఎంపీపీఎస్ ధర్మసాగర్
3) కె. హిమబిందు ఎస్ జీటీ ఎంపీపీఎస్ కేశవాపూర్

* శాయంపేట మండలం
1) ఎన్.నారాయణ ఎస్ జీటీ ఎంపీపీఎస్ నేరేడుపల్లి

* అయినవోలు మండలం
1)జె.రమేష్ బాబు ఎస్ ఏ జెడ్పీహెచ్ ఎస్ మరియాపురం

* వేలేరు మండలం
1) తడక ప్రభాకర్ హెచ్ పీటీ యూపీఎస్ గుండ్ల సాగర్
2) బానోతు లీలా బాయి ఎల్ ఎఫ్ ఎఫ్ హెచ్ఎం ఎంపీపీఎస్ వేలేరు

* హసన్ పర్తి మండలం
1) రావుల శ్రీధర్ ఎస్ఏ జెడ్ పీహెచ్ ఎస్ ముచ్చర్ల
2) మాలోతు పూల్ సింగ్ ఎస్ ఏ జెడ్పీహెచ్ ఎస్ మల్లారెడ్డిపల్లి

* దామెర మండలం
1) వల్లంపట్ల శ్యాంసుందర్ ఎస్ జీటీ ఎంపీయూపీఎస్ తక్కల్లపాడు
2)ఎన్. రాధాకృష్ణ చారి ఎస్ ఏ జెడ్పీహెచ్ ఎస్ పులుకుర్తి

* కమలాపూర్ మండలం
1)సీహెచ్ అర్చన ఎస్ వో కేజీవీబీ కమలాపూర్
2)ఆర్ సునీత టీజీటీ మోడల్ స్కూల్ ఎల్కతుర్తి

RELATED ARTICLES

Most Popular

Recent Comments