Saturday, April 5, 2025
Homeటాప్ స్టోరీస్టీపీపీసీసీ పీఠం మహేష్ కుమార్ గౌడ్ కే..!

టీపీపీసీసీ పీఠం మహేష్ కుమార్ గౌడ్ కే..!

మహేశ్ కే మకుటం…?

టీపీసీసీగా బీసీ నేతకు అవకాశం.. 

గెలిచి నిలుపుకున్న రేవంత్.. 

అనుయాయుడికి ఇప్పించుకునే కార్యంలో సక్సెస్..

స్పాట్ వాయిస్, బ్యూరో: దాదాపుగా అనుకున్నది అనుకున్నట్టే.., అంతా ఊహించినట్టే. సీఎం తర్వాత ఇంచుమించు ఆ స్థాయి వ్యక్తి. రాష్ట్ర పార్టీ సారథి. అంతటి హోదాను ఎవరు మాత్రం ఇతరులకు కట్టబెడుతారు, ఎందుకు వేరే వారికి వదులుతారు. తాను వదులుకోవాల్సిన సీటును తన వారికే దక్కేలా చూసుకోవడంలో తప్పులేదు., తప్పదు కూడా. సీఎం రేవంత్ కూడా ఆ పంథాలోనే కదిలారు., పంతం నెగ్గించుకున్నారు. పావులు కదిపి అనుకున్నది సాధించారు. తనవాడిగా, నమ్మిన బంటుగా మసులుకునే మహేష్ కుమార్ గౌడ్ కే పట్టం దక్కేలా అధిష్టానాన్ని ఒప్పించి విజయం సాధించారు. రేపోమాపో ప్రకటించడమే తరువాయి పీసీసీ ఛీఫ్ గా దాదాపు మహేష్ కుమార్ గౌడ్ ఫైనల్ అయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments