Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్మావోయిస్టు అగ్రనేత కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత కన్నుమూత

స్పాట్ వాయిస్, బ్యూరో: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్న కన్నుమూసినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే రాజారెడ్డి మృతిపై ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో ఆయనను పిలిచేవారు. ఆయనపై కోటి రూపాయల నజరానా కూడా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments