Monday, November 25, 2024
Homeతెలంగాణటమాట కూర చిచ్చు..

టమాట కూర చిచ్చు..

టమాట కూర చిచ్చు..
అత్తకోడళ్ల లొల్లి..
భార్య ఫిర్యాదుతో తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు..
స్పాట్ వాయిస్ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ఘటన జరిగింది. మహబూబాబాద్ మండలంలోని వేంనూరు గ్రామంలో ఆత్త కోడళ్ల మధ్య జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారింది. టమాటకూర బాగా వండలేదని కోడలిని అత్త బుజ్జి మందలించింది. దీంతో కోడలు నందిని అత్త తిట్టిందంటూ భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త మహేందర్ నా భార్యను మందలిస్తావా?’ అంటూ కోపంతో ఊగిపోయిన తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments