ముదిరాజ్ లకు నష్ట పరిహారం అందించాలి
మెపా టీజీ అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: ఇటీవల కురిసిన వర్షాలకు మహబూబాబాద్ లో దాదాపు 52 చెరువు కట్టలు తెగి మత్స్యకారులకు సుమారుగా రూ.40 కోట్లు నష్టం జరిగిందని, జిల్లా అధికారులు తక్షణమే చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టాలని, నష్టపరిహారాన్ని అందించాలని మెపా (( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ కోరారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో రాజుల కొత్తపల్లి, రావిరాల ఆలేరు తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. చెరువులను పరిశీలించిన అనంతరం మెపా రాష్ట్ర కార్యదర్శి తోట రమేష్ ముదిరాజ్ అధ్యక్షతన నెల్లికుదురు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజులకు తగిన న్యాయం చేయకుంటే త్వరలో జిల్లా కేంద్రంలో నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజ్, దండు చిరంజీవి ముదిరాజు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సుమారుగా 1,50,000మంది మత్స్యకారులు చెరువుల పై ఆధారపడి జీవిస్తున్నారని, చేప పిల్లలను అప్పులు తెచ్చి పోసుకోవడం జరిగిందని, ఇప్పుడు జీవనాధారం లేక అప్పుల పాలు తీర్చలేక, కడుపు నిప్పుకోలే ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి, సింగారపు రామకృష్ణ, నీరటి రాజు, తోట రమేష్, తోట సురేష్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ, మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుండి అశోక్, మహబూబాబాద్ జిల్లా నాయకులు జెట్టి యాకయ్య, జిల్లా వ్యాప్తంగా మెపా నాయకులు బత్తిని మల్లయ్య, తోట నరసయ్య, యాకయ్య వెంకన్న, యాదగిరి, సుధాకర్, గాండ్ల వీరభద్ర,గొడుగు సత్తయ్య,డేగల వెంకన్న,డేగల నవీన్, వెంకటయ్య, మంద బిక్షం, గోధుమల హరికృష్ణ, కుక్కల ఐలయ్య, గోధుమల దుర్గేష్, పూస అంజయ్య, గోధుమల రమేష్,కమలాకర్, రమేష్,రాజు,నర్సయ్య పాల్గొన్నారు
Recent Comments