అనాథాశ్రమంలో పిల్లలతో కేక్ కట్ చేసిన ఉద్యోగులు
స్పాట్ వాయిస్, బాలసముద్రం: టీఎన్జీవోస్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం వరంగల్ శివనగర్ డాన్ బాస్కో అనాథాశ్రమంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కేక్ కట్ చేయించి, పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తన సమస్యగా భావించి ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న రాజేందర్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు నగదురహిత వైద్యాన్ని అందించేలా కృషి చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు, మురళీధర్ రెడ్డి, గద్దల రాజు, సహాయ కార్యదర్శులు తోట చందర్ వంశీ, మురళి, చిరంజీవి, పోగుల వేణు, గణేష్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జిల్లా నాయకులు శంకర్ రాజేష్, వివేక్, మహేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ జన్మదిన వేడుకలు..
RELATED ARTICLES
Recent Comments