తెలంగాణ జన సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా జావీద్
స్పాట్ వాయిస్, నర్సంపేట : తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నర్సంపేట పట్టణానికి చెందిన షేక్ జావిద్ నియమితులయ్యారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన మూడో ప్లీనరీలో ఈ ఎన్నిక జరిగింది. కాగా, జావీద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు, టీజేఎస్ ఏర్పాటు తర్వాత బాధ్యతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు, ప్రజల సమస్యలపై స్పందించినందుకు గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారని, ఇప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యానని, క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలను బాధ్యతగా నిర్వహిస్తానని, అన్ని వర్గాల ప్రజల సమస్య పట్ల స్పందిస్తానన్నారు.
తెలంగాణ జన సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా జావీద్
RELATED ARTICLES
Recent Comments