**తెలంగాణ నిర్మాణ పార్టీ*
చర్లపల్లి జైలు ముందునుంచే అనౌన్స్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మాడని, తాము వీకర్ సెక్షన్స్తో ఉన్నామని తీన్మార్ మల్లన్న అన్నారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తన పార్టీ పేరు ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ అని తెలిపాడు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. పార్టీ ప్రకటన చేశాడు. జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. చాలామంది అభిమానులు మల్లన్నతో సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. తన కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. తీన్మార్ మల్లన్నకు మల్కాజ్ గిరి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మల్లన్నతో పాటు క్యూ న్యూస్ స్టాఫ్ట్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరి దగ్గర రూ.20వేల ష్యూరిటీని పూచీకత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. మల్లన్నపై మేడిపల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో క్రైం నెంబర్ 294, క్రైం నెంబర్ 299 రెండింటిలో మల్లన్నకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మేడిపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని షరతు విధించింది.
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ
RELATED ARTICLES
Recent Comments