మల్లారం గుట్ట సమీపంలో కనిపించిన పాదముద్రలు
స్పాట్ వాయిస్, మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పులి జాడలు కనిపించాయి. మల్హర్ మండలంలో పులి సంచారించిన ఆనవాళ్లు కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాలోని అటవీ మండలాలు అయిన కాటారం, మహా ముత్తారం, మహాదేవ్ పూర్, పలిమెల, మల్హర్ మండలాల్లో తరుచుగా ఏదో ఒక మండలంలో పులి కదలికలు నమోదు అవుతున్నాయి. మూడు వారాల క్రితం భూపాలపల్లి, నాచారం మధ్య గల జమ్మల బండ వద్ద కనిపించిన పులి పాదముద్రలు తాజాగా మల్హర్ మండలంలోని మల్లారం గుట్ట మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సమీపంలో కనిపించాయి. వివరాల్లోకి వెళ్తే.. మల్లారం గుట్ట సమీపంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో పులి మానేరు నది వైపు నుంచి ఎడ్లపల్లి అడవుల వైపు రోడ్ దాటుతుండగా లారీ డ్రైవర్ చూసి విషయాన్ని స్థానిక గ్రామస్తులతో పాటు అధికారులకు సమాచారం చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం లారీ డ్రైవర్ చెప్పిన మల్లారం పెద్ద గుట్ట సమీపంలో పరిశీలించగా పులి పాద ముద్రలు కనిపించాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రజలు ,పశువుల కాపరులు అడవిలోకి ఒంటరిగా వెళ్లకూడదు అని పులి కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని, పులికి ఎటువంటి హాని తలపెట్ట కూడదని అధికారులు సూచించారు.
భూపాలపల్లి జిల్లాలో మళ్లీ పులి జాడలు
RELATED ARTICLES
Recent Comments