హేమాచల క్షేత్రం పరిసరాల్లో ఆనవాళ్లు
అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై టీవీఆర్ సూరి
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. మంగపేట మండలం మల్లూరు గ్రామ సమీపంలోని హేమాచల క్షేత్రం పరిసరాల్లో పులి తిరిగిన ఆనవాళ్లు కనబడడంతో ప్రజలు భయపడిపోతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం సమీపంలో గోదావరి నది దాటి మంగపేట మండలం చుంచుపల్లి దగ్గర గోదావరి దాటి హేమాచల క్షేత్రం వైపు పులి కాలి ముద్రలు ఉన్నట్లు ఇంచార్జ్ ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ మంగలంపల్లి అశోక్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే గోదావరి తీర ప్రాంతంలో కొంతమంది రైతులు పుచ్చతోటలు సాగు చేస్తున్నారు. సోమవారం రాత్రి తోటల వద్ద పడుకున్న సమయంలో పెద్ద పులి అరుపులు వినిపించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులతో పాటు ఎస్సై టివిఆర్ సూరి సూచించారు.
Recent Comments