బొగ్గులవాగు ప్రాజెక్ట్ పరిసరాల్లో పులి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
స్పాట్ వాయిస్, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంత కాలంగా సంచరిస్తున్న పెద్దపులి పాదముద్రలను సోమవారం మల్హర్ మండలం ఎడ్లపల్లి సమీపంలోని బొగ్గుల వాగు ప్రాజెక్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు గుర్తించినట్టు భూపాలపల్లి రేంజర్ బస్వ నరేష్ తెలిపారు. ఆదివారం మల్హర్ మండలం కిషన్ రావుపల్లి, శాత్రాజ్ పల్లి అడవుల సమీపంలో ఉన్న పెద్దపులి సోమవారం బొగ్గులవాగు ప్రాజెక్ట్ పరిసరాల్లో సంచరించినట్లు చెప్పారు. కావున సమీప గ్రామల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , ఎవరు అడవుల లోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.
Recent Comments